Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 21 September 2026, 3:39 pm Posted by : MOHAMMED BASHEERUDDIN..

మన హక్కులను కాపాడుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, రాహుల్ గాంధీ ప్రధాని కావాలి….* *ఏ ఎన్నికలు వచ్చినా స్టేషన్ ఘనపూర్ పై కాంగ్రెస్ జెండానే ఎగరాలి….* *రాహుల్ గాంధీని ప్రధాని చేయడం, రేవంత్ రెడ్డిని రెండోసారి ముఖ్యమంత్రిని చేయడమే మన లక్ష్యం….అభిప్రాయబేధాలు పక్కన పెట్టి కుటుంబ సభ్యులుగా కలిసి పని చేద్దాం…..

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక సెప్టెంబర్ 21 స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం

-వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పార్టీని బలోపేతం చేయాలి….

-ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో స్టేషన్ ఘనపూర్ ను మున్సిపాలిటీ చేస్తానని హామీ ఇచ్చాను….

-ఇచ్చిన మాట ప్రకారం ఘనపూర్ ను మున్సిపాలిటీ చేశాను…

-మున్సిపాలిటీ అభివృద్ధికి 50కోట్ల నిధులు మంజూరు చేయించాను….

-త్వరలోనే 50కోట్ల పూర్తి అభివృద్ధి పనులు ప్రారంభం అవుతాయి…..

-నియోజకవర్గ ప్రజలకు ఏ చిన్న సమస్య వచ్చిన పరిష్కరించేందుకు కృషి చేస్తున్న….

-నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిని ఉప ముఖ్యమంత్రి పదవి నుండి భర్తరఫ్ చేశారు….

-కనీసం ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వలేదు ఇంతకంటే సిగ్గు చేటు ఉంటుందా…

 

 

 

*రాజకీయాలలో సిగ్గులేని వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది మాజీ ఎమ్మెల్యే రాజయ్యనేనని, రాజయ్య డకౌట్ కాలేదని హిట్ వికెట్ ద్వారా సెల్ఫ్ గోల్ కొట్టుకున్నాడని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి  విమర్శించారు.స్టేషన్ ఘనపూర్ పట్టణ కేంద్రంలోని ఎస్ కన్వెన్షన్ లో నిర్వహించిన స్టేషన్ ఘనపూర్ పట్టణ, వార్డు, అనుబంధ కమిటీల పరిచయ కార్యక్రమం మరియు పట్టణ విస్తృత స్థాయి సమావేశానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి  ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా కొత్తగా ఎన్నికైన పట్టణ కమిటీ కార్యవర్గ సభ్యులు, వార్డు అధ్యక్షులను శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు.

అనంతరం ఎమ్మెల్యే కడియం శ్రీహరి  మాట్లాడుతూ….. రాజకీయాలలో నాలుగుసార్లు ఎమ్మెల్యే గా గెలిచిన వ్యక్తిని ఉప ముఖ్యమంత్రి పదవి నుండి భర్తరఫ్ చేసి కనీసం ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వలేదు అంటే ఇంతకంటే సిగ్గుచేటు ఇంకా ఏమైనా ఉంటుందా అని ఏద్దేవా చేశారు. వాళ్ళు వాళ్ళ స్థాయిని మించి సభ్యత సంస్కారం లేకుండా హీనంగా మాట్లాడుతున్నారని అలాంటి వాళ్ళను ప్రజలు కూడా హీనంగానే చూస్తారని తెలిపారు. ఎమ్మెల్యేగా ఉన్నన్ని రోజులు నియోజకవర్గం పేరును, ఎమ్మెల్యే పేరు చెప్పుకోవడానికే సిగ్గు పడేటట్లు చేసిన వారి పేరు నేనూ మర్చిపోయాను, ప్రజలు కూడా మర్చిపోయారని అన్నారు. అలాంటి వారి గురించి మాట్లాడుకోవడం కూడా వేస్ట్ అని చెప్పారు. 15ఏళ్లలో ఏనాడూ నియోజకవర్గ అభివృద్ధిని, ప్రజా సమస్యలను పట్టించుకోలేదని, నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుండి 20ఏళ్లుగా ఆగిన అభివృద్ధిని పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నాని తెలిపారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో ఎక్కడా లేని విధంగా 1600కోట్ల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని అన్నారు. 45.50కోట్లతో 100పడకల ఆసుపత్రి, 26కోట్లతో ఇంటిగ్రెటెడ్ రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ కాంప్లెక్స్, 200కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రెటెడ్ స్కూల్, 6.10కోట్లతో డిగ్రీ కళాశాల, 400కోట్లతో ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్ హ్యామ్ రోడ్ల అభివృద్ధి వంటి అనేక అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు.ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో స్టేషన్ ఘనపూర్ పట్టణాన్ని మున్సిపాలిటీ చేస్తానని హామీ ఇచ్చానని, ఇచ్చిన మాట ప్రకారం మున్సిపాలిటీ చేశానని తెలిపారు. మున్సిపాలిటీ చేయడమే కాదు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడిగి రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీకి ఇవ్వనంత పెద్ద మొత్తంలో స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి 50కోట్ల నిధులు మంజూరు చేయించినట్లు పేర్కొన్నారు. సీఎం గారికి మన నియోజకవర్గంపై ఉన్న ప్రేమతో, నాపై ఉన్న అభిమానంతో అడిగిన వెంటనే 50కోట్లు మంజూరు చేశారని తెలిపారు. 50కోట్లలో ఇప్పటికే కొన్ని పనులు కొనసాగుతున్నాయని, అతి త్వరలోనే 50కోట్ల పూర్తి పనులు ప్రారంభం అవుతాయాని వెల్లడించారు. వీటితో పాటు ఫైనాన్స్ కార్పొరేషన్ నుండి మరో 8కోట్లు మంజూరు అయ్యాయని తెలిపారు. మున్సిపాలిటీలోని ప్రతీ వార్డుకు 15లక్షల అభివృద్ధి నిధులు, 10ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయనున్నట్లు చెప్పారు. అలాగే స్టేషన్ ఘనపూర్ రిజర్వాయర్ నుండి కుడి కాలువ ద్వారా కాలువ మరమ్మత్తులు చేసి మున్సిపాలిటీ రైతులకు సాగు నీరు అందిస్తున్నట్లు తెలిపారు.బిఆర్ఎస్, బీజేపీ పార్టీలు కాంగ్రెస్ ప్రభుత్వంపై విష ప్రచారాలు చేస్తున్నాయని బిఆర్ఎస్, బీజేపీల దాడిని తిప్పికొట్టాలని కార్యకర్తలకు సూచించారు. ప్రధాని మోడీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునే వ్యతిరేకించాడని చెప్పారు. గడిచిన 12ఏళ్లలో తెలంగాణ రాష్ట్రానికి ప్రధాని మోడీ ఒక 1000 కోట్ల ప్రాజెక్టు ఇవ్వలేదని, ఒక జాతీయ సంస్థను మంజూరు చేయలేదని అన్నారు. అయినా తెలంగాణ బీజేపీ నాయకులు సిగ్గులేకుండా డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని అంటున్నారని విమర్శించారు. బండి సంజయ్, కిషన్ రెడ్డి లు తెలంగాణకు ఎం తెచ్చారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. పక్క రాష్ట్రాలకు వేల కోట్ల నిధులు మంజూరు చేస్తూ తెలంగాణకు మాత్రం మొండి చేయి చూపిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగంలో సవరణలు చేసి మన హక్కులను కొల్లగొట్టాలని చేస్తోందని అన్నారు. మన హక్కులను కాపాడుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, రాహుల్ గాంధీ ప్రధాని కావాలని తెలిపారు. కేసీఆర్ కుటుంబం 10ఏళ్లలో అధికారాన్ని అడ్డంపెట్టుకొని వందల ఎకరాల భూమిని ఆక్రమించుకురాని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబానికి 2014ఎన్నికల అఫిడవిట్ లో ఒక్క ఎకరం లేదని చెప్పిన మీకు వందల ఎకరాలు, ఫామ్ హౌస్ లు, వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. అవి ఎప్పుడు, ఎలా వచ్చాయో తెలంగాణ ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. స్వయంగా కేసీఆర్ బిడ్డే తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. కేసీఆర్ కు నిజంగా తెలంగాణ ఉద్యమకారులపై ప్రేమ ఉంటే బిఆర్ఎస్ పార్టీ ఫండ్ 1400కోట్లను ఉద్యమకారులకు పంచాలని సవాల్ విసిరారు. తెలంగాణ వచ్చి ఉద్యమకారులకు, ప్రజలకు ఎం రాలేదని, కేసీఆర్ కుటుంబానికి పదవులు, అధికారం, ఫామ్ హౌస్ లు, ప్యాలెస్ లు, వందల ఎకరాల భూములు, వేల కోట్ల ఆస్తులు వచ్చాయని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజులలో ఏ ఎన్నికలు వచ్చినా స్టేషన్ ఘనపూర్ లో కాంగ్రెస్ జెండానే ఎగరాలని, అభిప్రాయబేధలను పక్కన పెట్టి అందరం కలిసి ఒకే కుటుంబ సభ్యులుగా పని చేద్దామని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంబాటి కిషన్ రాజ్, కౌన్సిలర్లు, వార్డు అధ్యక్షులు, పట్టణ కమిటీ కార్యవర్గ సభ్యులు, జిల్లా, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.