పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక సెప్టెంబర్ 24
భారీ వర్షాలు, ఈదురుగాలుల నేపథ్యంలో రోడ్డుపై విరిగిపడిన చెట్లను గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ డీఆర్‌ఎఫ్ బృందాలు వేగంగా తొలగించి రాకపోకలను పునరుద్ధరించాయి.హనుమకొండ ఎక్సైజ్ కాలనీ, ప్రభుత్వ టీబీ ఆసుపత్రి, దేవన్నపేట ప్రధాన రహదారి, సమ్మయ్యనగర్ ప్రాంతాల్లో చెట్లు నేలకొరగడంతో డీఆర్‌ఎఫ్ సిబ్బంది, అగ్నిమాపక శాఖ బృందాలు సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టాయి. ప్రభుత్వ టీబీ ఆసుపత్రి వద్ద విద్యుత్ స్తంభం, తీగలపై పడిన భారీ వృక్షాన్ని కూడా సురక్షితంగా తొలగించారు.జిల్లా ఫైర్ ఆఫీసర్ శంకర్‌లింగం నేతృత్వంలో జరిగిన ఈ చర్యల్లో ఫైర్ ఆఫీసర్ రాజేశ్వర్‌రావు, డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు.