భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి* -రెస్క్యూ బృందాలు, యంత్రాలు సిద్ధంగా ఉంచాలి: బల్దియా కమిషనర్ టి. వెంకన్న
పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక జిడబ్ల్యూఎంసీ, సెప్టెంబర్ 24: రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించిన నేపథ్యంలో గ్రేటర్ వరంగల్ నగర ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో నగరంలో ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.గురువారం జీడబ్ల్యూఎంసీ ఇంజనీరింగ్, శానిటేషన్, టౌన్ ప్లానింగ్, డీఆర్‌ఎఫ్ తదితర విభాగాల అధికారులతో కమిషనర్ టి. వెంకన్న టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు....