Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 21 September 2026, 10:10 am Posted by : MOHAMMED BASHEERUDDIN..

భక్తిశ్రద్ధల మధ్య వినాయక మండపాల్లో నాయిని నీలిమ రాజేందర్ రెడ్డి సందడి…

పరివర్తన అవాజ్  సెప్టెంబర్ 20  హన్మకొండ


గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని 49వ డివిజన్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు  నాయిని రాజేందర్ రెడ్డి  సతీమణి  నాయిని నీలిమ రాజేందర్ రెడ్డి  సందర్శించి గణనాథుడిని దర్శించుకున్నారు.ప్రగతి నగర్, సాయి కాలనీ, జీఎస్ టవర్స్, లెక్చరర్ కాలనీ, సాయి బృందావన్ కాలనీ, విష్ణుప్రియ కాలనీ, గణేష్ నగర్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన మండపాలను సందర్శించిన నాయిని నీలిమ రాజేందర్ రెడ్డి  ఆయా మండపాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా మండపాల నిర్వాహకులు, భక్తులతో ఆప్యాయంగా ముచ్చటించి ఉత్సవాల నిర్వహణ, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాల గురించి తెలుసుకున్నారు. గణనాథుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆమె ఆకాంక్షించారు.గణపతి నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో పాటు ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించుకోవాలని నిర్వాహకులకు సూచించారు. ఈ సందర్భంగా వివిధ మండపాల నిర్వాహకులు నాయిని నీలిమ రాజేందర్ రెడ్డి ని శాలువాలతో సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆయా డివిజన్ల ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.