పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక సెప్టెంబర్ 21 స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం
–గ్రామస్థాయి నుండి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి….
–పార్టీ నియామవళికి కట్టుబడి పార్టీ బలోపేతానికి కృషి చేయాలి….
–క్రమశిక్షణతో ప్రజల కోసం, పార్టీ కోసం పని చేసే వారినే పార్టీ ప్రోత్సహిస్తుంది….
–పేరు చెప్పుకొని ఊరేగుతా అంటే నా దగ్గర నడవదు….
*కష్టపడి పని చేసే వారికి, ప్రజల మధ్యలో ఉండే వారికి తప్పకుండ అవకాశాలు వస్తాయి….
–స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో ఇక కొత్త, పాత అనే చర్చ అవసరం లేదు……
–స్వంత పార్టీపైనే విమర్శలు చేసే వారు ఉన్నా ఒకటే… పోయినా ఒకటే….
–బీజేపీ తెలంగాణ అభివృద్ధిని అడుగడుగునా అడ్డుకుంటుంది….
–అంబేద్కర్ ని అవమానిస్తూ, రాజ్యాంగంలో మార్పులు చేసి రిజర్వేషన్లు ఎత్తివేయాలని చూస్తున్నారు….
–2014లో ఒక్క ఎకరం లేని మీకు ఇప్పుడు వందల ఎకరాలు, వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి….
–ఆ ఆస్తులు ఎప్పుడు, ఎలా వచ్చాయో ప్రజలకు చెప్పాలి….
–తెలంగాణాలో ఒక్క కేసీఆర్ కుటుంబమే బాగుపడింది….
–స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలపడమే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తున్న….
–అందరం కలిసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం, పార్టీని బలోపేతం చేసుకుందాం….
2029లో జరిగే లోక్ సభ, శాసన సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుపే ఏకైక లక్ష్యంగా కొత్త, పాత అనే బేధాలు లేకుండా అందరం కలిసి పని చేయాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పిలుపునిచ్చారు.ధర్మసాగర్ మండల కేంద్రంలోని సుస్మిత గార్డెన్స్ నిర్వహించిన ధర్మసాగర్ మండల, గ్రామ, అనుబంధ కమిటీల పరిచయ కార్యక్రమం మరియు మండల విస్తృత స్థాయి సమావేశానికి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి గ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ముందుగా ధర్మసాగర్ మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన మండల పార్టీ కార్యాలయాన్ని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇనుగాల వెంకట్రాంరెడ్డి తో కలిసి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రారంభించారు. అనంతరం కొత్తగా ఎన్నికైన మండల కమిటీ కార్యవర్గ సభ్యులు, గ్రామ శాఖ అధ్యక్షులను శాలువాలతో సత్కరించి కొత్తగా మండల, గ్రామ కాంగ్రెస్ పార్టీ సారథులుగా ఎన్నికైన వారికి అభినందనలు తెలిపారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ....
మనందరి ఏకైక ఎజెండా అభివృద్ధి, సంక్షేమ ఫలాలను పేద ప్రజలకు చేర్చడం, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమేనని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మనతో కలిసి రావడానికి ఇష్టంగా ఉన్న ఇతర పార్టీల నాయకులను పార్టీలోకి ఆహ్వానించాలని తెలిపారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో ప్రజల మధ్యలో ఉంటూ పార్టీ కోసం పని చేసే వారికే ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరే విధంగా మనందరం కలిసి కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేయాలని పిలుపునిచ్చారు. ఏ కార్యకర్తకు ఏ అవసరం ఉన్నా నేరుగా నన్ను కలువవచ్చని, మీ పనిలో న్యాయం ఉంటే తప్పకుండా చేసేందుకు పూర్తి స్థాయిలో ప్రయత్నిస్తానని వెల్లడించారు. నియోజకవర్గంలో ప్రతీ కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలి, రేవంత్ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి కావాలని అందుకు ప్రతీ కార్యకర్త కట్టుబడి పనిచేయాలని పిలుపునిచ్చారు.కాంగ్రెస్ ప్రభుత్వం చేసే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి బిఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఓర్వలేక పోతున్నాయని ఆరోపించారు. బిఆర్ఎస్, బీజేపీ పార్టీలు కాంగ్రెస్ ప్రభుత్వంపై చేసే దాడిని గట్టిగా తిప్పికొట్టాలని సూచించారు. బీజేపీ ప్రభుత్వం 12ఏళ్లలో తెలంగాణకు ఎం ఇచ్చారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రానికి ఒక 1000 కోట్ల ప్రాజెక్టు ఇవ్వలేదని, ఒక జాతీయ సంస్థను మంజూరు చేయలేదని అన్నారు. కులతత్వ, మతతత్వ రాజకీయాలు చేస్తూ ప్రజల మధ్య చిచ్చు పెట్టడం తప్ప పేద ప్రజల సంక్షేమాన్ని బీజేపీ ప్రభుత్వం, ప్రధాని మోడీ పట్టించుకోవడం లేదని విమర్శించారు. బీజేపీకి ప్రజలపై, రాజ్యాంగంపై నమ్మకం లేదని, దళితులు, మైనారిటీలు, పేద ప్రజలు అంటే గిట్టదని అన్నారు. బీజేపీ నాలుగవసారి అధికారంలోకి రావాలని చూస్తోందని, బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే మన హక్కులు పోతాయని అన్నారు. భారత దేశ మనుగడకు, రాజ్యాంగ పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీని బలపర్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. బిఆర్ఎస్, బీజేపీ పార్టీలు కాంగ్రెస్ ప్రభుత్వంపై పని గట్టుకొని విష ప్రచారాలు చేస్తున్నాయని బిఆర్ఎస్, బీజేపీల దాడిని తిప్పికొట్టాలని కార్యకర్తలకు సూచించారు. అందుకు మనమందరం కలిసి కట్టుగా ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు.తెలంగాణ పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చిన కల్వకుంట్ల కుటుంబం 10ఏళ్లలో అధికారాన్ని అడ్డంపెట్టుకొని వందల ఎకరాల భూమిని ఆక్రమించుకురాని ఆరోపించారు. బిఆర్ఎస్ నాయకులు ధరణిని అడ్డంపెట్టుకొని ఏ రకంగా పేదల భూములను ఆక్రమించుకున్నారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా వివరాలతో సహా వెల్లడించారాని తెలిపారు. కేసీఆర్ కుటుంబానికి 2014ఎన్నికల అఫిడవిట్ లో ఒక్క ఎకరం లేదని చెప్పిన మీకు వందల ఎకరాలు, ఫామ్ హౌస్ లు, వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబ ఆస్తులన్నీ కూడా అధికారాన్ని అడ్డంపెట్టుకొని అక్రమంగా సంపాదించినవే అని ఆరోపించారు. 2014కు ముందు మీ ఆస్తులు ఎన్ని ఇప్పుడు మీ ఆస్తులు ఎన్ని, అవి ఎప్పుడు, ఎలా వచ్చాయో తెలంగాణ ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఒక్క కేసీఆర్ కుటుంబమే బాగుపడిందని అన్నారు.ఈ కార్యక్రమంలో హన్మకొండ డిసిసి అధ్యక్షులు ఇనుగాల వెంకట్రాంరెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు గుర్రపు ప్రసాద్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పెసరు రమేష్, వివిధ గ్రామాల సర్పంచులు, జిల్లా, మండల స్థాయి నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు, మండల కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ సభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.