—బిక్షాటన రహిత నగరంగా వరంగల్‌ను తీర్చిదిద్దాలి… –భీమారంలోని పునరావాస కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కమిషనర్ వెంకన్న..
పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక జిడబ్ల్యూఎంసి , సెప్టెంబర్ 22: వరంగల్ నగరాన్ని బిక్షాటన రహిత ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సమగ్ర కార్యాచరణ చేపట్టాలని బల్దియా కమిషనర్ టి. వెంకన్న అధికారులను ఆదేశించారు.రహదారులు, బహిరంగ ప్రదేశాల్లో బిక్షాటనకు పాల్పడుతున్న వారిని గుర్తించి, వారికి అవసరమైన సంరక్షణతో పాటు గౌరవప్రదమైన జీవనానికి మార్గం చూపాలని సూచించారు.మంగళవారం హన్మకొండ పరిధిలోని భీమారంలో మినిస్ట్రీ ఫర్ సోషల్ జస్టిస్ ఎంపవర్మెంట్, జిడబ్ల్యుఎంసి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హెల్త్ కేర్ అండ్ సోషల్ వెల్ఫేర్...