ఆళ్లపల్లి, సెప్టెంబర్ 6:
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనలో 1000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆళ్లపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి, కాంగ్రెస్ జెండాలతో తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నాయకులు పిలుపునిచ్చారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎన్‌ఎస్ సెల్ ప్రతినిధులు, యువ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.