పరివర్తన అవాజ్ దిన పత్రిక వరంగల్. జిల్లా , సెప్టెంబర్ 20
జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 10 గంటల నుంచి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఒక ప్రకటనలో తెలిపారు.జిల్లా స్థాయిలో జిల్లా అధికారులు, రెవెన్యూ డివిజన్ స్థాయిలో రెవెన్యూ డివిజన్ అధికారులు, మండల స్థాయిలో మండల స్థాయి అధికారులు ప్రజావాణి కార్యక్రమన్ని నిర్వహిస్తారని పేర్కొన్నారు.ప్రజావాణిలో ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులను సంబంధిత అధికారులు పరిశీలించి, సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.ప్రజలు తమ సమస్యలు పై వినతులను ప్రజావాణి ద్వారా అధికారుల దృష్టికి తీసుకువచ్చి సమస్యల పరిష్కరించే దిశ గా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు రెవిన్యూ,మండల స్థాయిల లో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు.