పోషణ మాసంతో ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం.. -అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, మహిళలకు మెరుగైన పోషకాహారం అందించాలి: ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు …..

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక సెప్టెంబర్ 26 మహిళలు, చిన్నారుల ఆరోగ్యం, పోషకాహారంపై అవగాహన కల్పించేందుకు నిర్వహిస్తున్న “పోషణ మాసం” కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి  కేఆర్ నాగరాజు  ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. మహిళా శిశు సంక్షేమ శాఖ, ఐసీడీఎస్ వర్ధన్నపేట ప్రాజెక్టు ఆధ్వర్యంలో వర్ధన్నపేట మున్సిపల్ సమావేశం మందిరంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ కేంద్రాల సేవలు, చిన్నారులకు అందుతున్న పోషకాహారం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. “మన అంగన్‌వాడీ – మన బాధ్యత”...