పోడు భూమి జోలికి రాకుండా ఉండాలంటే రూ.30 వేలు.. లంచం తీసుకుంటూ అటవీ అధికారి ఏసీబీకి చిక్కాడు
ఆళ్లపల్లి, సెప్టెంబర్ 3: పోడు రైతు భూమిలో ట్రెంచ్ పనులు చేపట్టకుండా ఉండేందుకు లంచం డిమాండ్ చేసిన అటవీశాఖ బీట్ అధికారి ఏసీబీ వలకు చిక్కిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలంలో కలకలం రేపింది. రామానుజగూడెం గ్రామానికి చెందిన ఓ పోడు రైతు భూమికి సంబంధించిన విషయంలో బీట్ అధికారి బానోత్ రవికుమార్ రూ.30 వేల లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. లంచం మొత్తాన్ని మధ్యవర్తి సాదిక్ ద్వారా తీసుకునేందుకు ఒప్పందం జరిగినట్లు సమాచారం. పక్కా సమాచారంతో రంగంలోకి...