-పేదల సొంతింటి కలను సాకారం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం…ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక సెప్టెంబర్ 25 వరంగల్ వర్ధన్నపేట నియోజకవర్గంలోని 2వ డివిజన్ గుండ్లసింగారం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమంలో భాగంగా నిర్మించిన నూతన గృహాన్ని వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు ప్రారంభించారు. రెండో డివిజన్ పరిధిలోని గుండ్లసింగారంలో మాదాసి దయాకర్–సుజాత దంపతులకు మంజూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పూర్తికావడంతో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు స్వయంగా వెళ్లి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా నూతన ఇంటిని ప్రారంభించి, దయాకర్–సుజాత దంపతులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. కొత్త...