Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 25 September 2026, 1:51 pm Posted by : MOHAMMED BASHEERUDDIN..

-పేదల సొంతింటి కలను సాకారం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం…ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక సెప్టెంబర్ 25 వరంగల్

వర్ధన్నపేట నియోజకవర్గంలోని 2వ డివిజన్ గుండ్లసింగారం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమంలో భాగంగా నిర్మించిన నూతన గృహాన్ని వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి  కేఆర్ నాగరాజు  ప్రారంభించారు. రెండో డివిజన్ పరిధిలోని గుండ్లసింగారంలో మాదాసి దయాకర్–సుజాత దంపతులకు మంజూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పూర్తికావడంతో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు  స్వయంగా వెళ్లి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా నూతన ఇంటిని ప్రారంభించి, దయాకర్–సుజాత దంపతులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఇంటిలో వారు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి కల ఎంతో ముఖ్యమైనదని, ఆ కలను నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ప్రభుత్వం అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.ప్రతి అర్హులైన కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నామని, నియోజకవర్గంలో అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రయోజనం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, సంక్షేమ పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని చెప్పారు.
తమకు సొంత ఇల్లు నిర్మించుకునే అవకాశం కల్పించిన ప్రభుత్వానికి, ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి సహకరించిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కి దయాకర్–సుజాత దంపతులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో 2వ డివిజన్ అధ్యక్షులు పుట్ట తిరుపతి,వర్ధన్నపేట నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ గడిపి జీవన్,వంగపహడ్ మాజీ పాక్స్ చైర్మన్ అనిల్ రెడ్డి,మాజీ కార్పొరేటర్ బోడ డిన్న,డివిజన్ ప్రధాన కార్యదర్శి వంశీ,స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.