పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక సెప్టెంబర్ 26
ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు పుట్ట రవి తల్లి పుట్ట రాజమ్మ ఇటీవల మృతి చెందగా, వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు సుబ్బయ్యపల్లిలోని వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా పుట్ట రాజమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పుట్ట రవి , వారి కుటుంబ సభ్యులను ఓదార్చి, రాజమ్మ మృతికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఈ విషాద సమయంలో వారికి అండగా ఉంటానని ఎమ్మెల్యే నాగరాజు భరోసా ఇచ్చారు. పుట్ట రాజమ్మ గారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఎమ్మెల్యే నాగరాజు ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ వైస్ చైర్మన్ నిమ్మాని శేఖర్ రావు, 2వ డివిజన్ అధ్యక్షులు పుట్ట తిరుపతి, 56వ డివిజన్ అధ్యక్షులు కొంకా హరిబాబు, జిల్లా సీనియర్ నాయకులు గడ్డం శివరాం,సీనియర్ నాయకులు పుట్ట కృష్ణస్వామి, పుట్ట సురేందర్, వస్కుల చిరంజీవి, ఎమ్మార్పీఎస్ నాయకులు, డివిజన్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.