Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 26 September 2026, 6:45 am Posted by : MOHAMMED BASHEERUDDIN..

-నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదు— -మిస్ట్ బస్ స్టాప్ ల నిర్వహణ పరిశీలన– -జిడబ్ల్యూఎంసి కమిషనర్ వెంకన్న–

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక సెప్టెంబర్ జిడబ్ల్యూఎంసి, సెప్టెంబర్ 26:

పార్కులు, సెంట్రల్ మీడియన్లలో పచ్చదనం మరింత విస్తరించాలని జిడబ్ల్యూఎంసి కమిషనర్ టి. వెంకన్న అధికారులను ఆదేశించారు.గ్రేటర్ వరంగల్ నగరంలో హార్టికల్చర్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న పార్కులు, సెంట్రల్ మీడియన్లు, గ్రీనరీ అభివృద్ధి పనులను శనివారం కమిషనర్ హార్టికల్చర్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా కాజీపేట–సోమిడి సెంట్రల్ మీడియన్, ఎక్సైజ్ కాలనీలోని కనకదుర్గ పార్క్, పబ్లిక్ గార్డెన్, ప్రాంతాల్లో పచ్చదనం, సుందరీకరణ, మొక్కల సంరక్షణ, నిర్వహణ తీరును పరిశీలించారు. అదేవిధంగా వరంగల్ కోట చెరువు బండ్ వద్ద చేపట్టిన ప్లాంటేషన్ పనులను, లేబర్ కాలనీలోని టీఆర్టీ పార్కులో నూతనంగా చేపట్టిన గ్రీనరీ, సుందరీకరణ పనులను పరిశీలించారు.పార్కులు, మీడియన్లలో నాటిన మొక్కలను నాణ్యతతో సంరక్షిస్తూ, నిరంతరం పర్యవేక్షించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. మొక్కల పెరుగుదలకు అవసరమైన నీటి సరఫరా, నిర్వహణ, పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. చేపట్టిన పనుల బిల్లుల చెల్లింపులకు సంబంధించి అవసరమైన వివరాలను పరిశీలించి, పనుల నాణ్యతకు అనుగుణంగానే చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.నగర సుందరీకరణలో భాగంగా అభివృద్ధి చేస్తున్న ప్రతి గ్రీన్ స్పేస్ ఆకర్షణీయంగా, ఆహ్లాదకరంగా ఉండేలా చర్యలు చేపట్టాలని, నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని కమిషనర్ సూచించారు.ఈ సందర్భంగా కమిషనర్  హన్మకొండ పబ్లిక్ గార్డెన్, ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి వద్ద ఏర్పాటు చేసిన మిస్ట్ బస్ స్టాప్ లను పరిశీలించారు. వేసవి తాపం నుంచి ప్రయాణికులకు ఉపశమనం కలిగేలా మిస్ట్ బస్ స్టేషన్లు సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.అనంతరం చాకలి ఐలమ్మ జయంతి కు సంబంధించిన ఏర్పాట్లను కూడా కమిషనర్ పరిశీలించారు.కమిషనర్ వెంట చీఫ్ హార్టికల్చర్ ఆఫీసర్ లక్ష్మారెడ్డి, హార్టికల్చర్ అధికారి ప్రశాంత్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.