ఇల్లందు, సెప్టెంబర్ 9: ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు కోరం కనకయ్య పుట్టినరోజు సందర్భంగా ఇల్లందు మండలం ధనియాలపాడు గ్రామ పంచాయతీ పరిధిలో ఘనంగా వేడుకలు నిర్వహించారు.ధనియాలపాడు గ్రామ సర్పంచ్ సనప సావిత్రి ఆధ్వర్యంలో స్థానిక ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పెన్నులు, పలక-బలపాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరం కనకయ్య కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అంగోత్ ఆంజనేయులు నాయక్ , గ్రామ అధ్యక్షులు జబ్బా అంజయ్య , గ్రామ పెద్దలు పటేల్ నర్సయ్య , వార్డు మెంబర్ కిన్నెర కిషోర్ , ఉపాధ్యక్షులు తిప్పరపు ప్రసాద్ , మాజీ ఎంపీటీసీ సీతక్క , రమేష్ తదితరులు పాల్గొన్నారు