
అవాజ్ న్యూస్ సెప్టెంబర్ 08 ఆళ్లపల్లి
శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారి పై తాతా మధుసూదన్ గారు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, మర్కోడు గ్రామపంచాయతీలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా మర్కోడు గ్రామపంచాయతీ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ సుతారి రమాదేవి గారు, మాజీ ఎంపీపీ పడిగా సమ్మయ్య గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సుతారి కృష్ణ గారు ఆళ్లపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వాసం శ్రీకాంత్ గారు, యూత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉప సర్పంచ్ పగలబోయిన సతీష్ గారు.వాసం శ్రీనాథ్, ఆళ్లపల్లి మండల మర్కోడు కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు కోనేటి భద్రం గారు రెండో వార్డ్ నెంబర్ కేక్కెర్ల సునీత గారు మండల నాయకురాలు షేక్ పర్వీన్ గారు ఎస్సీ సెల్ ఇనుముల ఇందు కుమార్ నాయకులు, ఆళ్లపల్లి మండల ఎస్సీ సెల్ కార్యదర్శి కీసరి లాల్ బాబు గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని ర్యాలీగా బయలుదేరారు.తాతా మధుసూదన్ గారి వ్యాఖ్యలను ఖండిస్తూ నినాదాలు చేస్తూ, దళిత సమాజం మరియు ప్రజాప్రతినిధుల గౌరవాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, సర్పంచులు, కార్యకర్తలు, యువ నాయకులు, సీనియర్ నాయకులు మరియు అభిమానులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అనుచిత వ్యాఖ్యలను ఖండిద్దాం — ఆత్మగౌరవాన్ని కాపాడుదాం!ఇట్లుఆళ్లపల్లి మండల కాంగ్రెస్ పార్టీ.