-చైనాలో జరిగే ఆసియా కప్ సాఫ్ట్ బాల్ పోటీలకు ఎంపికైన హనుమకొండ క్రీడాకారిణి సాయి వర్షిణికి* -ఇనగాల చారిటబుల్ ట్రస్ట్ తరపున రూ. 10,000/- ఆర్థిక సహాయం అందించి, అండగా నిలిచిన హనుమకొండ డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి…
పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక సెప్టెంబర్ 21 హనుమకొండ జిల్లాకు చెందిన ఒక సాధారణ కుటుంబానికి చెందిన ప్రతిభావంతురాలైన యంగ్ సాఫ్ట్ బాల్ క్రీడాకారిణి, కుమారి వెల్పుల సాయి వర్షిణి (తండ్రి: అనిల్) అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభాపాటవాలు చాటేందుకు అద్భుతమైన అవకాశం దక్కించుకున్నారు. చైనాలోని వుక్సీ నగరంలో వచ్చే నెల అక్టోబర్ 12 నుండి 18 వరకు జరగబోయే ప్రతిష్టాత్మక "5వ అండర్-15 ఉమెన్స్ సాఫ్ట్బాల్ ఆసియా కప్ 2026" పోటీలలో భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించడానికి ఎంపికయ్యారు.ఈ సందర్భంగా క్రీడాకారిణి, హనుమకొండ...