పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక సెప్టెంబర్ 26 వరంగల్
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, ధైర్యసాహసాలకు ప్రతీకగా నిలిచిన చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు నివాళులర్పించారు. హన్మకొండ న్యూ శాయంపేట చౌరస్తాలో ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహానికి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి , పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మ ధైర్యం, ఆత్మగౌరవం, పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని అన్నారు. సామాజిక అసమానతలు, దోపిడీకి వ్యతిరేకంగా ఆమె సాగించిన పోరాటం తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని పేర్కొన్నారు. పేదలు, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం ఐలమ్మ చేసిన పోరాటం ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగేందుకు సమాజం ప్రోత్సహించాలని, మహిళా సాధికారతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. చాకలి ఐలమ్మ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆమెకు ఇచ్చే నిజమైన నివాళి అని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారు అన్నారు. ఆమె స్ఫూర్తితో సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో హన్మకొండ కలెక్టర్ శ్రీమతి చాహత్ బాజ్‌పాయ్, వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదా దేవి,జిల్లా ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చైర్మెన్, హసన్పర్తి పాక్స్ చైర్మన్ పింగళి వెంకటరెడ్డి,56వ డివిజన్ అధ్యక్షులు కొంకా హరిబాబు, జిల్లా నాయకులు శివరాం, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక నాయకులు,అధికారులు, తదితరులు పాల్గొని చాకలి ఐలమ్మకు ఘనంగా నివాళులు అర్పించారు.