చల్లసముద్రంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య జన్మదిన వేడుకలు – పేద మహిళలకు చీరల పంపిణీ
ఇల్లందు, సెప్టెంబర్ 9: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం చల్లసముద్రం గ్రామపంచాయతీ పరిధిలో మంగళవారం ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు కోరం కనకయ్య జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామంలోని పేద మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే కోరం కనకయ్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఇల్లందు మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తాటి భిక్షం, మాజీ ఉప సర్పంచ్ కుర్రా అరుణ, చలసముద్రం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొంతు వెంకన్న, వార్డు మెంబర్లు నరాటి కోటేశ్వరరావు, లక్ష్మయ్య,...