గణేష్ నిమజ్జనానికి పటిష్ఠ ఏర్పాట్లు.. -భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు… -బల్దియా ప్రత్యేకాధికారి, హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, కమిషనర్ టి.వెంకన్న…

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక  జిడబ్ల్యూఎంసి: సెప్టెంబర్ 22: గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన ఏర్పాట్లను బల్దియా ప్రత్యేకాధికారి, హన్మకొండ జిల్లా కలెక్టర్  చాహత్ బాజ్‌పాయ్, బల్దియా కమిషనర్ టి.వెంకన్న మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.హన్మకొండ పరిధిలోని సిద్దేశ్వరగుండం, బంధం చెరువు తదితర నిమజ్జన కేంద్రాలను సందర్శించిన వారు అక్కడ భక్తులు, గణేష్ ఉత్సవ కమిటీలకు అవసరమైన సౌకర్యాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిమజ్జన ప్రక్రియ సజావుగా సాగేందుకు అవసరమైన ఏర్పాట్లను ముందుగానే...