Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 21 September 2026, 10:10 am Posted by : MOHAMMED BASHEERUDDIN..

గణనాథుల చెంతకు ఎమ్మెల్యే నాయిని..  పలు గణేష్ మండపాల్లో ప్రత్యేక పూజలు.

పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక సెప్టెంబర్ 21  వరంగల్  పశ్చిమ నియోజకవర్గం.

గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు  నాయిని రాజేందర్ రెడ్డి  కాజిపేట పరిధిలోని 62వ డివిజన్‌లో ఉన్న సుప్రసిద్ధ శ్రీ శ్వేతార్క మూలగణపతి దేవాలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కి ఆలయ అర్చకులు, నిర్వాహకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో గణనాథుడికి నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే నాయిని పాల్గొని, ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలని స్వామివారిని ప్రార్థించారు.గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని కాజిపేట ప్రాంతంలోని వివిధ ప్రాంతాల్లో భక్తిశ్రద్ధలతో ఏర్పాటు చేసిన గణేష్ మండపాలను ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సందర్శించారు. ఆయా మండపాల్లో కొలువుదీరిన గణనాథులను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవ నిర్వాహకులు, భక్తులు ఎమ్మెల్యేకు ఆత్మీయంగా స్వాగతం పలికి తమ ప్రాంతాల్లో జరుగుతున్న గణేష్ ఉత్సవాల వివరాలను తెలియజేశారు.అనంతరం వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని 5వ, 7వ, 9వ డివిజన్ల పరిధిలో ఏర్పాటు చేసిన వివిధ గణేష్ మండపాలను కూడా ఎమ్మెల్యే నాయిని సందర్శించారు. ఆయా ప్రాంతాల్లో ప్రతిష్ఠించిన విఘ్నేశ్వరుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గణేష్ ఉత్సవ నిర్వాహకులతో మాట్లాడి ఉత్సవాల నిర్వహణ, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, స్థానిక పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు.గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రజల్లో భక్తి, ఆధ్యాత్మికతతో పాటు ఐక్యతా భావాన్ని పెంపొందిస్తాయని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి  పేర్కొన్నారు. వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని ఆయన ఆకాంక్షించారు. గణనాథుడి ఆశీస్సులతో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు.ఎమ్మెల్యే నాయిని పర్యటన సందర్భంగా ఆయా డివిజన్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, భక్తులు  పాల్గొన్నారు.