కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పలు అంశాలపై సీఎం రేవంత్‌రెడ్డిగారిని కలిసిన వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య—కేంద్రంతో మాట్లాడి వరంగల్‌కు నిధులు, కీలక సంస్థలు తీసుకురావాలని సీఎంకు విజ్ఞప్తి..
పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక సెప్టెంబర్ 25 వరంగల్ వరంగల్ ప్రాంత అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి గారిని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య కలిసి వినతిపత్రాలు అందజేశారు. కాకతీయ యూనివర్సిటీకి పీఎం-ఉషా నిధుల మంజూరు, వరంగల్ కోటలో పురావస్తు మ్యూజియం అభివృద్ధికి కేంద్ర నిధులు, వరంగల్‌లో నైలిట్ (NIELIT), సీఐటీడీ (CITD) కేంద్రాల ఏర్పాటు, పాస్‌పోర్ట్ సేవా కేంద్రం (PSK) ఏర్పాటు అంశాలను ముఖ్యమంత్రికి ఎంపీ వివరించారు. --కాకతీయ యూనివర్సిటీకి పీఎం-ఉషా నిధులు: కాకతీయ...