Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 26 September 2026, 12:26 pm Posted by : MOHAMMED BASHEERUDDIN..

–కాంగ్రెస్ సీనియర్ నాయకులు భుక్యా భాషా నాయక్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు.

.పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక సెప్టెంబర్ 26

వర్ధన్నపేట మాజీ కౌన్సిలర్ భుక్యా శ్రీలత  తండ్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భుక్యా భాషా నాయక్  ఇటీవల మృతి చెందడంతో వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి  కేఆర్ నాగరాజు వారి కుటుంబాన్ని పరామర్శించారు. వర్ధన్నపేట తలకుంటతండాలోని భుక్యా భాషా నాయక్  నివాసానికి వెళ్లిన ఎమ్మెల్యే నాగరాజు , ఆయన చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. భాషా నాయక్  మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ, ఆయన కాంగ్రెస్ పార్టీకి అందించిన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. భాషా నాయక్  ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఎమ్మెల్యే నాగరాజు  ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి,వైస్ చైర్మన్ శిభారాణి రాజేందర్, పట్టణ అధ్యక్షులు ఈగ దామోదర్, మార్కెట్ చైర్మెన్ నరకుడు వెంకటయ్య, పాక్స్ చైర్మన్ అబ్బిడి రాజిరెడ్డి, టెంపుల్ చైర్మెన్ ప్రభాకర్ గౌడ్, మండల అధ్యక్షులు వెంకన్న గౌడ్, మాజీ మండల అధ్యక్షులు ఎద్దు సత్యనారాయణ, కౌన్సిలర్లు, సర్పంచులు, ఉపసర్పంచులు, డైరెక్టర్లు, వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.