ఒక్క స్థలం దానం.. వేల ప్రాణాలకు రక్షణ! చల్లసముద్రం స్థల దాతల కోసం వెతుకులాట
ఇల్లందు:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం చల్లసముద్రం గ్రామపంచాయతీలో స్థానిక శాసనసభ్యులుకోరం కనకయ్య విశేష కృషితో ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (PHC) మంజూరు చేసింది. ఈ శుభవార్తతో గ్రామస్తులంతా ఎంతో సంతోషించినప్పటికీ, ఆసుపత్రి నిర్మాణానికి అనువైన ప్రభుత్వ స్థలం లేకపోవడం ఇప్పుడు అందరినీ కలవరపెడుతోంది. సరైన స్థలం చూపించకపోతే ఈ ఆసుపత్రి కూడా పక్క పంచాయతీకి తరలిపోయే ప్రమాదం ఉందని ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఈ ఊరికి మంజూరైన 'రైతు వేదిక' కూడా సరిగ్గా ఇలాగే స్థలాభావం వల్లే...