పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక సెప్టెంబర్ 22 హన్మకొండ
పర్వతగిరి సొసైటీ చైర్మెన్ పిన్నింటి అనిల్ రావు, చౌటపల్లి సొసైటీ చైర్మెన్ అతి కుమారస్వామి, ఆయా సొసైటీల కార్యవర్గ సభ్యులు మంగళవారం సుబేదారిలోని వర్ధన్నపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు ని* మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సొసైటీ ఛైర్మెన్లకు, కార్యవర్గ సభ్యులకు శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. అనంతరం ఆయా సొసైటీ కమిటీ సభ్యులకు రైతులకు అందుబాటులో ఉండాలని,రైతు సేవలకు అనుగుణంగా సేవలు అందించాలని పిలుపునిచ్చారు.సహకార సంఘాలు రైతులకు మరింత చేరువగా పనిచేస్తూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సూచించారు. రైతుల సంక్షేమం, సహకార సంఘాల బలోపేతానికి తనవంతు సహకారం అందిస్తానని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో పర్వతగిరి, చౌటపల్లి సొసైటీల కార్యవర్గ సభ్యులు,నాయకులు, తదితరులు పాల్గొన్నారు.