ఆళ్ళపల్లి, సెప్టెంబర్ 1: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, మహానేత దివంగత డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారి 17వ వర్ధంతి సందర్భంగా ఆళ్ళపల్లి మండల కేంద్రంలో సెప్టెంబర్ 2, బుధవారం ఉదయం 10:00 గంటలకు ఘనంగా వర్ధంతి కార్యక్రమం నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ ఆళ్ళపల్లి మండల అధ్యక్షులు వాసం శ్రీకాంత్ తెలిపారు.
పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, DCC అధ్యక్షురాలు శ్రీమతి తోట దేవి ప్రసన్న గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా వైఎస్సార్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించనున్నారు.
ఈ కార్యక్రమానికి ఆళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, SC సెల్ నాయకులు, ముఖ్య కార్యకర్తలు, బూత్ కమిటీ & గ్రామ కమిటీ అధ్యక్షులు, మహిళలు, యువకులు, వైఎస్సార్ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వాసం శ్రీకాంత్ కోరారు.
— వాసం శ్రీకాంత్
కాంగ్రెస్ పార్టీ ఆళ్ళపల్లి మండల అధ్యక్షులు