ఆళ్లపల్లి సర్పంచుల సంఘానికి కొత్త సారథ్యం.. ఏకగ్రీవంగా నూతన కార్యవర్గం

అవాజ్ న్యూస్ | సెప్టెంబర్ 03 | ఆళ్లపల్లి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండల సర్పంచుల సంఘానికి నూతన కార్యవర్గం కొలువుదీరింది. మండలంలోని సర్పంచులంతా సమావేశమై పరస్పర ఏకాభిప్రాయంతో నూతన బాధ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా పాయం రామనర్సయ్య, ఉపాధ్యక్షురాలిగా సుతారి రమాదేవి, కార్యదర్శిగా వాసం సుస్మిత ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గ ఎన్నిక అనంతరం సర్పంచులు వారిని శాలువాలు, పూలమాలలతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు, ఉపాధ్యక్షురాలు, కార్యదర్శి మాట్లాడుతూ తమపై విశ్వాసం ఉంచి బాధ్యతలు అప్పగించిన...