Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 03 September 2026, 11:38 am Posted by : Bommala Kumar

ఆళ్లపల్లి సర్పంచుల సంఘానికి కొత్త సారథ్యం.. ఏకగ్రీవంగా నూతన కార్యవర్గం

అవాజ్ న్యూస్ | సెప్టెంబర్ 03 | ఆళ్లపల్లి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండల సర్పంచుల సంఘానికి నూతన కార్యవర్గం కొలువుదీరింది. మండలంలోని సర్పంచులంతా సమావేశమై పరస్పర ఏకాభిప్రాయంతో నూతన బాధ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా పాయం రామనర్సయ్య, ఉపాధ్యక్షురాలిగా సుతారి రమాదేవి, కార్యదర్శిగా వాసం సుస్మిత ఎన్నికయ్యారు.

నూతన కార్యవర్గ ఎన్నిక అనంతరం సర్పంచులు వారిని శాలువాలు, పూలమాలలతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు, ఉపాధ్యక్షురాలు, కార్యదర్శి మాట్లాడుతూ తమపై విశ్వాసం ఉంచి బాధ్యతలు అప్పగించిన ప్రతి సర్పంచుకు కృతజ్ఞతలు తెలిపారు.మండలంలోని గ్రామాల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయడంతో పాటు, ప్రభుత్వ దృష్టికి పంచాయతీల అవసరాలను తీసుకెళ్లి అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. అన్ని గ్రామ పంచాయతీల సర్పంచులను సమన్వయం చేసుకుంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.

కార్యక్రమంలో పలువురు సర్పంచులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు పాల్గొని నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.