ఆళ్లపల్లిలో ఘనంగా వైఎస్సార్ వర్ధంతి వేడుకలు

ఆళ్లపల్లి: దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని పురస్కరించుకొని ఆళ్లపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వాసం శ్రీకాంత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన నాయకులు, మహిళా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి, పుష్పాంజలి ఘటించి ఆయన సేవలను స్మరించుకున్నారు. “వైఎస్ రాజశేఖర్ రెడ్డి అమర్ రహే” అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా...