ఆరు గ్యారంటీలతో ప్రజల జీవితాల్లో వెలుగులు* టీ మీడియా సెప్టెంబర్ 06ఆళ్లపల్లి *ప్రజాక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ పరమావధి: వాసం శ్రీకాంత్

ఆళ్లపల్లి మండల కేంద్రంలోని మర్కోడు గ్రామపంచాయతీలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన 1000 రోజుల ప్రజా పాలన ముగిసిన సందర్భంగా సంబరాలు అంబరాన్నంటాయి. పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, డిసిసి అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్నల ఆదేశాల మేరకు ఆదివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మర్కోడు గ్రామపంచాయతీ సర్పంచ్ సుతారి రమాదేవి, ఉప సర్పంచ్ వగలబోయిన సతీష్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఇనుముల ఇందు కుమార్ల అధ్యక్షతన జరిగిన ఈ సంబరాలకు ముఖ్య అతిథిగా ఆళ్లపల్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వాసం శ్రీకాంత్...