Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 06 September 2026, 11:35 am Posted by : Bommala Kumar

ఆరు గ్యారంటీలతో ప్రజల జీవితాల్లో వెలుగులు* టీ మీడియా సెప్టెంబర్ 06ఆళ్లపల్లి *ప్రజాక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ పరమావధి: వాసం శ్రీకాంత్

ఆళ్లపల్లి మండల కేంద్రంలోని మర్కోడు గ్రామపంచాయతీలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన 1000 రోజుల ప్రజా పాలన ముగిసిన సందర్భంగా సంబరాలు అంబరాన్నంటాయి. పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, డిసిసి అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్నల ఆదేశాల మేరకు ఆదివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మర్కోడు గ్రామపంచాయతీ సర్పంచ్ సుతారి రమాదేవి, ఉప సర్పంచ్ వగలబోయిన సతీష్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఇనుముల ఇందు కుమార్ల అధ్యక్షతన జరిగిన ఈ సంబరాలకు ముఖ్య అతిథిగా ఆళ్లపల్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వాసం శ్రీకాంత్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వాసం శ్రీకాంత్ మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే ఆరు గ్యారంటీల ప్రాతిపదికగా ప్రజాక్షేమమే పరమావధిగా పరిపాలిస్తోందని కొనియాడారు. బి.ఆర్.ఎస్ తప్ప రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని విమర్శించారు.మహిళలకు, యువతులకు, ట్రాన్స్‌జెండర్లకు RTC బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో పాటు, 43 లక్షల కుటుంబాలకు రూ. 500లకే వంటగ్యాస్ సిలిండర్ అందిస్తున్నాం. ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలకు నెలకు దాదాపు రూ. 3,000 పైగా ఆదా అవుతోంది.53 లక్షలకు పైగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ (Zero Bills) అందిస్తూ నెలకు రూ. 1,000 నుండి రూ. 1,500 వరకు కరెంట్ బిల్లుల భారాన్ని తగ్గించాం.అన్నదాతల కోసం రూ. 2 లక్షల వరకు రుణమాఫీ అమలు చేసి 25 లక్షలకు పైగా రైతు కుటుంబాలను అప్పుల బాధల నుంచి విముక్తి చేశాం. వరి పంటకు రూ. 500 బోనస్, ఉచిత విద్యుత్, రైతు బీమా, నష్టపరిహారంతో వ్యవసాయాన్ని పండుగగా మార్చాం.సొంతింటి కల నెరవేర్చేందుకు మొదటి విడతగా 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టడం జరిగింది. ప్రతి అర్హ కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నాం. రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ. 10 లక్షలకు పెంచాం. కొత్తగా 15 లక్షల పైచిలుకు రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ, 2.25 లక్షల కొత్త పింఛన్లు మంజూరు చేశాం. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, స్కిల్ యూనివర్సిటీ ద్వారా అభివృద్ధిని వేగవంతం చేశాంకాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని వంద శాతం నెరవేర్చే వరకు విశ్రమించదని, ప్రజల ఆశయాలకు అనుగుణంగా రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రెండోసారి భారీ మెజారిటీతో అధికారంలోకి రావడం ఖాయమని మండల అధ్యక్షులు వాసం శ్రీకాంత్ స్థానిక నాయకులు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మండల నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు