Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 26 September 2026, 12:25 pm Posted by : MOHAMMED BASHEERUDDIN..

అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులతో నగరానికి మహర్దశ కొత్త రోడ్ల పనులకు కొంత విరామం: ఎమ్మెల్యే నాయిని నాయిని రాజేందర్‌రెడ్డి

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక సెప్టెంబర్ 26

హనుమకొండ, సెప్టెంబర్ 26: అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ పనులు పూర్తయిన తర్వాతే కొత్త రోడ్ల నిర్మాణ పనులను చేపడతామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి తెలిపారు. శనివారం 59వ డివిజన్ పరిధిలోని ఎక్సైజ్ కాలనీలో రూ.1.05 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న అంతర్గత రోడ్లు, సైడ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చొరవతో వరంగల్ నగరానికి సమగ్ర అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను తీసుకొస్తున్నామని తెలిపారు. ఇందుకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ తుది దశలో ఉందన్నారు.ప్రస్తుతం రోడ్లు నిర్మించి, కొద్ది నెలలకే డ్రైనేజీ పైప్‌లైన్ల కోసం వాటిని తిరిగి తవ్వాల్సిన పరిస్థితి రాకూడదన్నారు. నగరంలో ఉన్న పాత పైప్‌లైన్ల స్థానంలో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా కొత్త పైప్‌లైన్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.నగరాన్ని దీర్ఘకాలికంగా, ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ భారీ ప్రాజెక్టును చేపడుతోందన్నారు. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తయిన తర్వాత రోడ్లను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.రోడ్డు పనులు పెండింగ్‌లో ఉన్న ప్రాంతాలను గుర్తించండి. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తయ్యాక అన్ని రోడ్లను ఒకేసారి నాణ్యతతో అభివృద్ధి చేద్దాం. వేసిన రోడ్లనే మళ్లీ తవ్వాల్సిన పరిస్థితి రాకుండా ప్రజలు కొంతకాలం ఓపిక పట్టాలి. నగర భవిష్యత్ అభివృద్ధి కోసం ప్రజలు సహకరించాలి అని ఎమ్మెల్యే నాయిని కోరారు.