కామారెడ్డి పట్టణ పద్మశాలి సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
పరివర్తన ఆవాజ్ కామారెడ్డి: కామారెడ్డి పట్టణ పద్మశాలి సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి హాజరై నూతన కార్యవర్గ సభ్యులను అభినందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పద్మశాలి సంఘం సమాజ అభివృద్ధికి చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు సాగుతూ విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. యువతకు మెరుగైన అవకాశాలు కల్పించడంతో పాటు పేద, మధ్యతరగతి...