Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 23 August 2026, 2:47 pm Posted by : parivarthanaawaaz

కామారెడ్డి పట్టణ పద్మశాలి సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

పరివర్తన ఆవాజ్ కామారెడ్డి: కామారెడ్డి పట్టణ పద్మశాలి సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి హాజరై నూతన కార్యవర్గ సభ్యులను అభినందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పద్మశాలి సంఘం సమాజ అభివృద్ధికి చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు సాగుతూ విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. యువతకు మెరుగైన అవకాశాలు కల్పించడంతో పాటు పేద, మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు.నూతనంగా ఎన్నికైన కార్యవర్గం పద్మశాలి సంఘం అభ్యున్నతికి, సభ్యుల సంక్షేమానికి కృషి చేయాలని సూచించారు. సంఘాన్ని మరింత బలోపేతం చేస్తూ సామాజిక సేవా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని కోరారు.ఈ కార్యక్రమంలో, అధ్యక్షులు సబ్బాని కృష్ణ హరి, ఉపాధ్యక్షులు అలవాల సతీష్, వెంకటస్వామి, పడిగ శ్రీనివాస్, కొండ రమేష్, సహాయ కార్యదర్శి, శ్రీనివాస్, బండమీది రాజేశం, నరసయ్య, వెంకట స్వామి, పద్మశాలి సంఘం సభ్యులు మరియు మహిళా సభ్యులు ఉన్నారు.