Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 20 August 2026, 12:17 pm Posted by : parivarthanaawaaz

రాజీవ్ గాంధీ జయంతి

రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు

కామారెడ్డి పరివర్తన ఆవాజ్  : భారత మాజీ ప్రధానమంత్రి, భారతరత్న స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా కామారెడ్డి పట్టణ కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తాలో ఆయన విగ్రహానికి డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ ,టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఘన నివాళులు అర్పించారు.   ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ దేశానికి అందించిన సేవలను ఆయన స్మరించుకున్నారు. దేశాన్ని ఆధునిక సాంకేతికత వైపు నడిపించడంలో, యువతకు అవకాశాలు కల్పించడంలో రాజీవ్ గాంధీ కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ ఆశయాలు, దేశాభివృద్ధి కోసం ఆయన చేసిన కృషి నేటి తరానికి స్ఫూర్తిదాయకమని గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో,డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్,మున్సిపల్ కౌన్సిలర్, జిల్లా సేవాదళ్ అధ్యక్షులు గడ్డమీది మహేష్,కామారెడ్డి నియోజకవర్గం అధ్యక్షులు మెహర్ బాబా గౌడ్,టౌన్ అధ్యక్షులు సుదర్శన్,డిసిసి ఉపాధ్యక్షులు పంపరి లక్ష్మణ్, డీసీసీ జనరల్ సెక్రెటరీ నిమ్మ విజయకుమార్, మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు,పంపరి శ్రీనివాస్, చాట్ల వంశీ, జమీల్, రంగరమేష్ గౌడ్,సాయి బాబు, సేవాదళ్ జిల్లా యూత్ అధ్యక్షుడు, నర్సల్లా మహేష్,ఆబిద్, నిరంజన్,ఇమరోజ్,శశి,రాహుల్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.