Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 25 August 2026, 11:20 am Posted by : parivarthanaawaaz

డ్రంక్ అండ్ డ్రైవ్‌పై పోలీసుల కొరడా

కామారెడ్డి జిల్లా పరివర్తన ఆవాజ్ :  మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు జిల్లాలో 38 మంది పై డ్రంక్ అండ్ డ్రైవ్ శిక్షలు, 5 మందికి ఒకరోజు జైలు శిక్ష రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రజల భద్రతే లక్ష్యంగా కామారెడ్డి జిల్లా పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్‌పై నిరంతరం ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. జిల్లాలో మొత్తం 38 మంది పై డ్రంక్ అండ్ డ్రైవ్ శిక్షలు వారికి మొత్తం రూ.40,700/- జరిమానా విధించబడింది. మద్యం సేవించి వాహనం నడిపిన 5 మందికి ఒకరోజు జైలు శిక్ష విధించబడింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ యం రాజేష్ చంద్ర, IPS మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని, వాహనం నడిపే వ్యక్తితో పాటు ఇతర వాహనదారులు, ప్రయాణికుల ప్రాణాలకు కూడా ప్రమాదం ఏర్పడుతుందని తెలిపారు. మద్యం సేవించి వాహనం నడిపే వారిపై చట్టపరమైన చర్యలతో పాటు జైలు శిక్ష కూడా తప్పదని స్పష్టం చేశారు.ప్రజలు మద్యం సేవించి వాహనం నడపకుండా బాధ్యతగా వ్యవహరించాలని, రోడ్డు భద్రతా నిబంధనలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని జిల్లా ఎస్పీ  సూచించారు.మద్యం సేవించి వాహనం నడపవద్దు.. మీ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడండి” అని కామారెడ్డి జిల్లా పోలీసులు విజ్ఞప్తి చేశారు.