గార్ల CHCలో డ్యూటీ డాక్టర్ల చార్ట్ వివరాలు వెల్లడించాలని ప్రజల విజ్ఞప్తి

పరివర్తన ఆవాజ్. మహబూబాబాద్ ప్రతినిధి పగడాల రామారావు గార్ల: స్థానిక మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ (CHC)లో విధులు నిర్వహిస్తున్న డ్యూటీ డాక్టర్ల వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని మండల ప్రజలు కోరుతున్నారు.ఆసుపత్రిలో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న వైద్యుల పేర్లు, హోదాలు, డ్యూటీ సమయాలు, ఏ రోజుల్లో ఏ డాక్టర్ విధుల్లో ఉంటారు, డ్యూటీ రోస్టర్ చార్ట్ వంటి వివరాలను ఆసుపత్రి ప్రాంగణంలో స్పష్టంగా ప్రదర్శించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.ప్రభుత్వ ఆసుపత్రికి ప్రతిరోజూ పరిసర గ్రామాల నుంచి అనేక మంది రోగులు వైద్యం కోసం...