పరివర్తన ఆవాజ్. మహబూబాబాద్ ప్రతినిధి పగడాల రామారావు గార్ల: స్థానిక మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (CHC)లో విధులు నిర్వహిస్తున్న డ్యూటీ డాక్టర్ల వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని మండల ప్రజలు కోరుతున్నారు.ఆసుపత్రిలో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న వైద్యుల పేర్లు, హోదాలు, డ్యూటీ సమయాలు, ఏ రోజుల్లో ఏ డాక్టర్ విధుల్లో ఉంటారు, డ్యూటీ రోస్టర్ చార్ట్ వంటి వివరాలను ఆసుపత్రి ప్రాంగణంలో స్పష్టంగా ప్రదర్శించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.ప్రభుత్వ ఆసుపత్రికి ప్రతిరోజూ పరిసర గ్రామాల నుంచి అనేక మంది రోగులు వైద్యం కోసం వస్తుంటారని, వైద్యుల విధుల సమయాలు, డ్యూటీ వివరాలు ముందుగా తెలిసేలా సమాచారం అందుబాటులో ఉంటే రోగులకు మరింత సౌకర్యంగా ఉంటుందని వారు పేర్కొంటున్నారుఅలాగే ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించేలా అధికారులు పర్యవేక్షించాలని ప్రజలు కోరుతున్నారు. సిహెచ్సిలోలో అందుబాటులో ఉన్న వైద్య సేవలు, డ్యూటీ డాక్టర్ల చార్ట్, వైద్యుల హోదా, విధుల సమయాలపై పూర్తి వివరాలను ఆసుపత్రి అధికారులు వెల్లడించాలని మండల ప్రజలు కోరుతున్నారు.