(పగడాల రామారావు పరివర్తన ఆవాజ్. )ఆగస్టు 29నరసింహులపేట తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా నరసింహులపేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. వ్యవహారిక భాషా పితామహుడు గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులకు తెలుగు భాషా ప్రాముఖ్యతను, గిడుగు రామ్మూర్తి పంతులు తెలుగు భాషకు చేసిన సేవలను ఉపాధ్యాయులు వివరించారు. గిడుగు జయంతి అయిన ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటామని, తెలుగు భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.