పరివర్తన ఆవాజ్ కామారెడ్డి జిల్లా: కామారెడ్డి జిల్లా కేంద్రంలో మిలాద్ ఉన్ నబీ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు పాత బస్టాండ్ నుంచి భారీ జులూస్ నిర్వహించారు. రైల్వే కమాన్, నిజాంసాగర్ ఎక్స్ రోడ్, కొత్త బస్టాండ్, రైల్వే గేట్, సైలానీ బాబా కాలనీ మీదుగా ఇస్లాంపూర్ నిరంజశావళి దర్గా వరకు ర్యాలీ కొనసాగింది.ఈ సందర్భంగా ముస్లిం సోదరులు మాట్లాడుతూ. కులమతాలకు అతీతంగా ప్రజలంతా ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. గంగా జమునా తహజీబ్‌ను కాపాడుకోవాలని, ప్రవక్త మహమ్మద్ బోధించిన ప్రేమ, శాంతి, సోదరభావం, మానవత్వం వంటి విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని కోరారు.ఈ కార్యక్రమాన్ని మదీనా మజీద్ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు.

