పగడాల రామారావు పరివర్తన అవాచ్ ఆగస్టు 31 గార్ల. అఖిల భారత రైతు కూలి సంఘం (ఏఐకేఎంఎస్ ) రాష్ట్ర తొమ్మిదవ మహాసభను సెప్టెంబర్ 8 9 తేదీలలో మంచిర్యాల పట్టణంలో జరుపుకుంటున్నది. ఈ సందర్భంగా రాష్ట్ర నలువైపుల నుండి ప్రతినిధులు వేల సంఖ్యలో పాల్గొంటున్నారు అని ఈ మహాసభలను జయప్రదం చేయాలని సోమవారం స్థానిక మండల పరిధిలో, చిన్న కిస్టాపురం, దేశ తండ, గ్రామాలలో పోస్టర్స్ ఆవిష్కరణ జరిగింది. అనంతరం జి సక్రు ప్రసంగిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతు ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ పోరాటాలు నిర్వహిస్తుందని ప్రజల నాయమైన సమస్యల పరిష్కారం కోసం జీవించే హక్కును కాపాడుకోవడం కోసం పెళ్ళు పీకిన పోరాటాలలో ఎందరో వీరులు నాటి దొడ్డి కొమరయ్య నుండి నేటి పూణే లింగన్న వరకు ఆణిముత్యాలు లాంటివారు తమ అమూల్యమైన ప్రాణాలు అర్పించారని ఆ పోరాట వారసత్వం కొనసాగింపుగానే భూస్వాముల భూములు పంచాలని దోపిడి లేని సమ సమాజాన్ని నిర్మాణం చేయడం కోసం అఖిల భారత రైతు కూలి సంఘం పోరాడుతుందని ఈ సందర్భంగానే గత కాలంలో చేసుకున్న కార్యక్రమాలను నెమరు వేసుకొని భవిష్యత్తు ప్రణాళికను రూపొందించుకోవడం కోసం ఈ మహాసభలు జరుపుకుంటుందని ఈ మహాసభలకు ప్రతినిధులు పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో (ఏఐకేఎంఎస్ ) మండల అధ్యక్షులు ఎం మాన్య, ఉపాధ్యక్షులు సూత్రపు మనోహర్, పి వై ఎల్ మండల నాయకులు బి మంగీలాల్, బి శివ, కుమార్ తదితరులు పాల్గొన్నారు. వార్త రూపేనా