కామారెడ్డిలో TNGO ఉద్యోగుల ధర్నా 6 పెండింగ్ డీఏలు.. 2వ పీఆర్సీ అమలు చేయాలి

పరివర్తన ఆవాజ్ కామారెడ్డి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన 6 పెండింగ్ డీఏలను వెంటనే విడుదల చేయాలని, 2వ పే రివిజన్ కమిషన్ (PRC)ను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ TNGO ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్దనున్న ధర్నా చౌక్‌లో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ.. ఉద్యోగులకు రావాల్సిన డీఏలు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉండటంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అలాగే 2వ పీఆర్సీ అమలులో జాప్యం చేయకుండా ప్రభుత్వం తక్షణమే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్...