Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 21 August 2026, 8:34 am Posted by : parivarthanaawaaz

జిల్లా నీటిపారుదల ప్రాజెక్టుల భూసేకరణపై కలెక్టర్ కీలక ఆదేశాలు

పరివర్తన ఆవాజ్ కామారెడ్డి జిల్లా:జిల్లాలో నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ భూసేకరణ, పరిహారం చెల్లింపు, ప్రక్రియలను వేగవంతంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశించారు.శుక్రవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో నీటిపారుదల ప్రాజెక్టుల పరిధిలో పెండింగ్ భూసేకరణ, పరిహారం చెల్లింపు తదితర అంశాలపై నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులతో కలిసి మంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.కామారెడ్డి జిల్లా క్యాంప్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, అదనపు కలెక్టర్ రెవెన్యూ విక్టర్. తో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నీటిపారుదల ప్రాజెక్టుల పనులు సకాలంలో పూర్తయ్యేందుకు పెండింగ్ భూసేకరణను పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. పెండింగ్ భూసేకరణ కోసం ప్రభుత్వం రూ.2,800 కోట్లు విడుదల చేసేందుకు చర్యలు చేపట్టిందని, ఇందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారని పేర్కొన్నారు.కొత్త ఆయకట్టు సృష్టించేందుకు వీలుగా పెండింగ్ భూసేకరణ, పనులను వేగవంతంగా పూర్తి చేయాలని మంత్రి సూచించారు. భూసేకరణకు అవసరమైన నిధులు అందుబాటులో ఉన్నందున ఎక్కడా జాప్యం లేకుండా ప్రక్రియను పూర్తి చేసి, ప్రాజెక్టుల పనులకు ఎలాంటి ఆటంకం కలగకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్లను ఆదేశించారు. వీసీ అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాలో నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ భూసేకరణ, పరిహారం చెల్లింపు, సంబంధించిన ప్రక్రియలను వేగవంతంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. పెండింగ్ భూసేకరణకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే క్షేత్రస్థాయిలో పరిశీలించి, రైతులతో సమన్వయం చేసుకుంటూ పరిష్కరించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ విక్టర్. నీటి పారుదల శాఖ ఆర్డీవోలు తదితరులు పాల్గొన్నారు.