Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 24 August 2026, 8:32 am Posted by : parivarthanaawaaz

ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డుకు చట్టబద్ధమైన జీవో ఇవ్వాలి..

  పరివర్తన ఆవాజ్ రాజంపేట :తెలంగాణలో ఆటో డ్రైవర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని రాజంపేట మండల ఆటో కార్మికులు డిమాండ్ చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కారణంగా ఆటోలకు ఆదాయం తగ్గి కుటుంబ పోషణ, ఈఎంఐలు, అద్దెలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నామని ఆటో డ్రైవర్లకు ఏటా రూ.12 వేల ఆర్థిక సాయం, నిరుద్యోగ భృతి, పెన్షన్ అందించాలని కోరారు. సంక్షేమ బోర్డు ఏర్పాటుపై కేవలం ప్రకటనలు కాకుండా చట్టబద్ధమైన జీవో విడుదల చేయాలని లిఖితపూర్వక ఉత్తర్వులు ఇచ్చే వరకు పోరాటం కొనసాగిస్తామని ఆటో కార్మికులు స్పష్టం చేశారు