పరివర్తన ఆవాజ్ కామారెడ్డి జిల్లా : కామారెడ్డి జిల్లా మార్కజ్ ఎ మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్లో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఇస్లాం ప్రవక్త పుట్టిన రోజు సందర్భంగా ఈ సంవత్సరం మహమ్మద్ ప్రవక్త మిలాద్ ఉన్ నభి రోజున ముస్లిం మత సోదరులు శాంతి యుతంగా భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త శాంతి మార్గంలో నడిచారని వారి మార్గంలోని మేము కూడా నడుస్తామని వివరించారు. ర్యాలీ సందర్భంగా ఎలాంటి వాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుల నుండి పర్మిషన్లు సైతం తీసుకుంటున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మొహమ్మద్ నజీరుద్దీన్ అహ్మద్, ఉపాధ్యక్షులు మొహమ్మద్ ముషరఫ్, జనరల్ సెక్రెటరీ అబ్దుల్ మజీద్, ప్రోగ్రాం డైరెక్టర్స్ మహమ్మద్ నాహిద్ హుస్సేన్, మొహమ్మద్ నౌ సీన్, మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.