విద్యుత్ షాక్ తో రైతు మృతి

మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ మండలం గంగాపూర్ తండాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. తండాకు చెందిన మూడవత్ గోపాల్ (28) పొలం వద్ద విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. ఈ ఘటనతో గంగాపూర్ తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. స్థానికుల సమాచారం ప్రకారం.. గోపాల్ తన పొలం వద్ద ఉన్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. తీవ్ర విద్యుదాఘాతానికి గురైన ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. విషయం తెలియగానే కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు....