వసూళ్ల ఆరోపణలతో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిపై వేటు
గడ్డం శ్రీనును విధుల్లోంచి తొలగిస్తూ మియాపూర్ డిప్యూటీ కమిషనర్ ప్రెస్‌నోట్ వసూళ్ల ఆరోపణలు ఎదుర్కొంటున్న అవుట్‌సోర్సింగ్ ఉద్యోగిని విధుల్లోంచి తొలగిస్తున్నట్లు మియాపూర్ సర్కిల్–48 డిప్యూటీ కమిషనర్ సోమవారం అధికారికంగా ప్రెస్‌నోట్ విడుదల చేశారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ), శేరిలింగంపల్లి జోన్ (ఎస్‌ఎల్‌పీజెడ్) పరిధిలోని మియాపూర్ సర్కిల్–48లో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగి మడికంటి ప్రవీణ్‌కుమార్ (గడ్డం శ్రీను)పై వసూళ్ల ఆరోపణలు రావడంతో అతడి సేవలను నిలిపివేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు సదరు ఉద్యోగిని విధుల్లోంచి తొలగించాలని ఆదేశిస్తూ లేఖ...