భవన బిల్డర్ ను అరెస్ట్ చేసిన రాయదుర్గం పోలీసులు
బిల్డర్ అరెస్ట్.. కాంట్రాక్టర్ కోసం ప్రత్యేక పోలీసు బృందాల గాలింపు శేరిలింగంపల్లి,పరివార్తన అవాజ్,ఆగస్టు 24: అనుమతులు లేకుండా నిర్మిస్తున్న జీ+6 భవనం కూలి ఇద్దరు కార్మికులు మృతి చెందిన ఘటనలో ప్రధాన నిందితుడైన బిల్డర్‌ను రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న సయ్యద్ సజీద్ అలియాస్ సయ్యద్ సాజిద్ (39)ను ఈ నెల 23న రంగారెడ్డి జిల్లా శంషాబాద్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న కాంట్రాక్టర్ ఖాజా మొయినుద్దీన్ అలియాస్ మహ్మద్ ఖాజా మియా కోసం ప్రత్యేక...