చందానగర్ పీఎస్‌లో ఏసీబీ పంజా
లంచం తీసుకుంటూ పట్టుబడిన ఎస్‌ఐ, కానిస్టేబుల్ చందానగర్ పోలీస్ స్టేషన్‌లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు శనివారం దాడి నిర్వహించారు. ఛార్జ్‌షీట్ దాఖలు చేసేందుకు రూ.75 వేల లంచం తీసుకుంటుండగా ఎస్‌ఐ బందేల బలరాజ్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. చందానగర్ పీఎస్‌లో నమోదైన క్రైమ్ నంబర్ 696/2026 కేసులో ఛార్జ్‌షీట్ దాఖలు చేసేందుకు ఎస్‌ఐ రూ.లక్ష డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు . బాధితుడి నుంచి నగదు తీసుకుంటుండగా అధికారులు పట్టుకుని, ఎస్‌ఐ టేబుల్ డ్రాయర్‌లో ఉన్న రూ.75 వేల నగదును స్వాధీనం...