గచ్చిబౌలి భవనం కూలిన ఘటనలో బిగ్ యాక్షన్.. టౌన్ ప్లానింగ్ అధికారి సస్పెన్షన్
బిల్డర్లపై క్రిమినల్ కేసులకు ఆదేశాలు.. అక్రమ నిర్మాణాలపై ప్రత్యేక తనిఖీలకు కమిషనర్ ఆదేశం గచ్చిబౌలి: అంజయ్యనగర్‌లో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న బహుళ అంతస్తుల భవనం కూలి ఇద్దరు మృతి చెందిన ఘటనపై సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) అధికారులు కఠిన చర్యలకు శ్రీకారం చుట్టారు. నిర్మాణానికి సంబంధించి ముందుగానే నోటీసులు జారీ చేసినప్పటికీ, భవన నిర్మాణాన్ని నిలిపివేయడంలో నిర్లక్ష్యం వహించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఆఫీసర్ యు. సంతోష్ కుమార్‌ను సస్పెండ్ చేశారు. అదే సమయంలో అక్రమ నిర్మాణానికి బాధ్యులైన భవన...